ETV Bharat / state

ఆలోచన అదిరింది.... బ్యాటరీ బైక్​ వచ్చింది

ప్రతిభకు కొలమానంలేదు... పట్టుదలకు అవరోధం ఉండదని నిరూపించాడో యువకుడు. కలలు కనడమే కాదు వాటిని సాకారం చేసుకోవాలనే పట్టుదలతో అసాధ్యమనుకున్నది సాధించి చూపించాడు. పెట్రోల్​ లేకుండా బ్యాటరీపై నడిచే హైబ్రిడ్​ బైకును తయారు చేసి ఔరా అనిపించాడు నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రానికి చెందిన గణేష్​.

ఆలోచన అదిరింది.... బ్యాటరీ బైక్​ వచ్చింది
author img

By

Published : Jul 24, 2019, 8:03 AM IST

నేటి రోజుల్లో మోటర్​ సైకిల్​ మనిషి జీవితంలో ఓ భాగం. బైకు లేకుండా గడపదాటాలంటే ఎలా అని ఆలోచిస్తున్నారు ప్రజలు. పెట్రోలు ధరల మంటలకు భయపడి బండి తీయడానికి వెనకాడుతున్న పరిస్థితి. బైకుందని గాలికి తిరిగితే జేబుకు చిల్లుపడుతోంది. దీనికి పరిష్కారం అన్వేషిస్తూనే కాలుష్యరహితంగా బ్యాటరీతో నడిచే మోటర్​ సైకిల్​ రూపొందించాడు నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రానికి చెందిన గణేష్​. ప్రస్తుతం విఫణిలో బ్యాటరీతో నడిచే స్కూటీలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. కానీ బైకుల్లేవు.. అందుకోసమే బ్యాటరీతో నడిచే బైకును తయారు చేశాడు. దీనికి టూ ఇన్​ వన్​ హైబ్రిడ్​ బైక్​ అని పేరు పెట్టాడు.

ఆలోచన వచ్చిందిలా..

తన పాత పల్సర్​ బైకును అమ్మేసి బ్యాటరీతో నడిచే స్కూటీ కొందామని ఓ షోరూంకు వెళ్లాడు గణేష్​. కానీ అది గంటకు 40 కిమీ వేగం మించి వెళ్లదని ఆలోచన విరమించుకున్నాడు. తన బైకుకే బ్యాటరీ అమిర్చితే ఎలా ఉంటుందనే ఆలోచనతో అంతర్జాలంలో వెతికి తానే స్వయంగా తయారు చేసుకోవాలనుకున్నాడు. ముంబయి వెళ్లి ఓ ఇంజినీరు సహాయంతో రూ.70 వేలు వెచ్చించి బైకుకు కావాల్సిన సామగ్రి తెచ్చి సొంతంగా తన పల్సర్​ బైకుకు బ్యాటరీ బిగించాడు. దీనికి ఎలాంటి మెయింటినెన్స్​ అక్కరలేదు. ఇంజిన్​ ఆయిల్​, గేర్​ మార్చుకోవడం, సైలెన్సర్​ వంటివి అవసరం లేదు. కేవలం ఛార్జింగ్​ పెట్టుకుని నడుపుకోవడమే.

రెండు గంటల ఛార్జింగ్​... 60 మైళ్ల ప్రయాణం

ఈ బైక్​ పెట్రోలు, బ్యాటరీతోనూ పనిచేస్తోంది. రెండు గంటలు ఛార్జింగ్​ పెడితే గంటకు 40 కిమీ వేగంతో 60 మైళ్లు దూసుకుపోవచ్చని తెలిపాడు. 60 కిమీ వేగంతో అయితే 40 మైళ్లు వెళ్లొచ్చంటున్నాడు. కేవలం ఒక స్విచ్​ నొక్కి పెట్రోల్​తో కూడా ఈ టూ ఇన్​ వన్​ బైకుపై దూసుకుపోవచ్చంటున్నాడు గణేష్​. ఈ వాహనం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని తెలిపాడు. ఎలాంటి ధ్వని కాలుష్యం ఉండదు. ఆలోచనను ఆచరణలో పెడితే దాని సత్పలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ప్రయోగం ఓ చక్కటి ఉదాహరణ. యువత తలచుకుంటే సాధించలేనిదేదీ లేదనడానికి ఇదో గీటురాయి.

ఆలోచన అదిరింది.... బ్యాటరీ బైక్​ వచ్చింది
ఇదీ చూడండి: తండ్రికి సాయం... ఆవిష్కరణకు ఊతం...

Intro:హైదరాబాద్: చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా తెరాస పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి కి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగా కెసిఆర్ కి పాలాభిషేకం మరియు సన్నాహక సభ ఏర్పాటు చేసిన తెలంగాణ ఫార్మర్ సంఘం తెలంగాణ కుల సంఘం.

Body:ఈ సందర్భంగా పౌల్ట్రీ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ పౌల్ట్రీ రంగాన్ని గుర్తించి మాలో ఒక రైతుబిడ్డ బిడ్డ రంజిత్ రెడ్డి కి చేవెళ్ల పార్లమెంట్ రు అభ్యర్థిగా ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేశారు.

Conclusion:
అదేవిధంగా అత్యధిక మెజార్టీతో రంజిత్ రెడ్డి ని గ
అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త కు ఒక సైనికుల్లా పని చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటా చెప్పుడు మాటలు కాకుండా మనస్ఫూర్తిగా పని చేసుకుంటూ ప్రజాసేవ చేస్తూ పార్లమెంట్లో కావాల్సిన నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు

బైట్:రంజిత్ రెడ్డి
(చేవెళ్ల పార్లమెంట్ తెరాస పార్టీ అభ్యర్థి)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.