కరోనా వైరస్ ఇతరుల నుంచి ప్రబలుతున్న నేపథ్యంలో కళ్లు, ముక్కు, నోటిని తాకకుండా ఓ విద్యార్థి కరోనా నియంత్రణ టోపీని తయారు చేశాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన శ్రీరామదాసు ధర్మసాయి.. హైదరాబాద్లోని మహవీర్ ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కళ్లు, ముక్కు, నోటిని తాకకుండా సెన్సార్ను ఉపయోగించి ఒక టోపీ యంత్రాన్ని తయారు చేశాడు. ఆ టోపీ ధరించిన వ్యక్తి.. తన ముక్కు, నోటిని తాకేందుకు యత్నిస్తే.. ఎరుపు రంగుతో విద్యుత్తు దీపం వెలిగి.. ఒక రకమైన శబ్ధం చేసి.. అప్రమత్తం చేస్తుంది. ఈ యంత్రానికి 200 రూపాయలు ఖర్చు అయినట్లు ధర్మసాయి వివరించారు.
ఇవీ చూడండి: కరోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు