నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామంలో కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి బ్యాంకు ఉద్యోగి మృతి చెందాడు. పెంట్లవెల్లి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉప మేనేజరుగా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ ప్రతిరోజు వాకింగ్‌కు వెళ్లి కృష్ణా నదిలో స్నానం చేసి వచ్చేవాడు. రోజూ లాగే ఇవాళ కృష్ణానదిలో స్నానానికని వెళ్లి కనిపించకుండా పోయాడు.
స్థానికులు నాటు పడవల ద్వారా వెతికారు. ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక మత్స్యకారులతో కలిసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి.. మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. మృతుడు కిరణ్ కుమార్ రెడ్డిది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు .