ETV Bharat / state

అమ్రాబాద్​లో 50 కోట్లతో రిసార్ట్​ ప్రారంభం - నాగర్​ కర్నూల్​ జిల్లా అమ్రాబాద్

నల్లమల, పాపికొండల ప్రాంతాలను గోవాను తలదన్నే విధంగా అభివృద్ధి చేస్తామని పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. నాగర్​ కర్నూల్​ జిల్లా అమ్రాబాద్​లో 50 కోట్లతో నిర్మించిన రిసార్ట్సును ప్రారంభించారు.

అమ్రబాద్​లో 50 కోట్లతో రిసార్ట్​ ప్రారంభం

author img

By

Published : Feb 5, 2020, 12:02 AM IST

అమ్రబాద్​లో 50 కోట్లతో రిసార్ట్​ ప్రారంభం

రాష్ట్రంలోని నల్లమలను పర్యటక హబ్​, టూరిజం జోన్​గా అభివృద్ధి చేస్తామని పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పేర్కొన్నారు. అలాగే విదేశీయులు బస చేసేలా తయారు చేస్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ నల్లమల అటవీ ప్రాంతంలో 50 కోట్లతో నిర్మించిన రిసార్ట్స్​ను జడ్పీ ఛైర్పర్సన్ పద్మావతి, జిల్లా కలెక్టర్ శ్రీధర్, స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి ప్రారంభించారు.

తెలంగాణలో పర్యటక ప్రాంతాల అభివృద్దికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం టూరిజం ప్యాకేజీలను చేపడతామన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆధ్వర్యంలో నల్లమల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని.. పాపికొండలను గోవాను తలదన్నే విధంగా అభివృద్ధి పరుస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఇవీ చూడండి: మేడారానికి అప్పుడే భక్తుల తాకిడి.. ఆకట్టుకుంటున్న డ్రోన్​ దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.