ETV Bharat / state

మధ్యాహ్న భోజనం వికటించి 40 మందికి అస్వస్థత - undefined

రోజు మాదిరిగానే మధ్యాహ్నం బడిగంట మోగింది. ప్లేట్లు పట్టుకుని క్యూలో నిలబడ్డారు. వంకాయ కూరతో వేడివేడిగా తిన్నారు. అంతలోనే వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి ప్రారంభమైంది. మధ్యాహ్య భోజనం వికటించడం ఈ మధ్య సర్వసాధారణంగా మారిపోయింది. ప్రస్తుతం నాగర్​ కర్నూల్​ జిల్లా చంద్రకల్​ ప్రభుత్వ పాఠశాలలో 40 మంది విద్యార్థులు పాలయ్యారు.

మధ్యాహ్న భోజనం వికటించి 40 మందికి అస్వస్థత

author img

By

Published : Jan 2, 2020, 11:34 PM IST

మధ్యాహ్న భోజనం వికటించి 40 మందికి అస్వస్థత

నాగర్​కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. మధ్యాహ్న భోజనం అనంతరం అరగంట వ్యవధిలోనే విద్యార్థులందరూ తీవ్ర వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, తలనొప్పికి గురయ్యారు. ఉపాధ్యాయులు వారిని నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మొత్తం పాఠశాలలో 170 మంది విద్యార్థులు ఉండగా 40 మంది ఆస్పత్రి పాలయ్యారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

మధ్యాహ్నం వంకాయకూరతో భోజనం చేసినట్లు విద్యార్థులు చెప్పారు. ఫుడ్​ పాయిజన్​ నీటి ద్వారానో.. లేదంటే తిన్న ఆహారం ద్వారానో జరిగి ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు విషయం తెలియకుండా ఆస్పత్రికి తరలించడంపై ఆస్పత్రి వద్ద వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలెక్టర్ శ్రీధర్ హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి చేరుకొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వారిని ఆదేశించారు. ఘటన ఎలా జరిగిందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు తెలిపారు.

నాగర్ కర్నూలు జడ్పీ చైర్​పర్సన్​ పద్మావతి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆస్పత్రికి వచ్చి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి వైద్యులనడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Intro:TG_MBNR_12_2_VIDYARTHULAKU_ASWASTHATHA_UPDATE_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
NOTE:- విద్యార్థులకు అస్వస్థత అయినా ఐటమ్ కు అప్డేటెడ్ గా అదే స్లగ్ తో పంపుతున్నాను గమనించగలరు.
( ) నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన ఘటన లో జిల్లా కలెక్టర్ శ్రీధర్ హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి చేరుకొని విద్యార్థులను పరిశీలించారు.విద్యార్థుల పరిస్థితులను డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు...సంఘటన ఎలా జరిగిందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.... ప్రాథమిక సమాచారం మేరకు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్టు తెలుస్తుందన్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని... మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించామన్నారు.విద్యార్థుల తిన్న ఆహారాన్ని శాంపిల్స్ను సేకరించి ఏం జరిగిందో తెలుసుకొని చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు....AVB
BYTE:- జిల్లా కలెక్టర్ శ్రీధర్

Body:TG_MBNR_12_2_VIDYARTHULAKU_ASWASTHATHA_UPDATE_AVB_TS10050_SD

Conclusion:TG_MBNR_12_2_VIDYARTHULAKU_ASWASTHATHA_UPDATE_AVB_TS10050_SD

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.