హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో డెంగీతో బాధపడుతున్న పదేళ్ల బాలిక మృతి చెందింది. నాగర్‌కర్నూల్‌కు చెందిన బాలికను కుటుంబసభ్యులు నీలోఫర్ హాస్పిటల్లో చేర్పించారు. బాధితురాలు చికిత్స పొందుతూ ఈరోజు మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధితురాలిని వేరే వార్డుకు తరలించే క్రమంలో ఆక్సీజన్ తొలగించటం వల్లే... తమ అమ్మాయి మరణించిందని కుటుంబసభ్యలు ఆరోపించారు.
ఇవీ చూడండి : వెనక్కి తగ్గమంటున్న ప్రభుత్వం, కార్మిక సంఘాలు...