ఇవీ చూడండి: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
ములుగు జిల్లాలో చేతబడి నెపంతో మహిళపై దాడి - ములుగు జిల్లా మచ్చాపూర్
ములుగు జిల్లా మచ్చాపూర్‌లో చేతబడి చేస్తుందని ఓ మహిళపై బానోత్ మొగిలి అనే వ్యక్తి బ్లేడుతో దాడి చేశాడు. బాధితురాలి అరుపులు విని వచ్చిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
చేతబడి నెపంతో మహిళపై దాడి
చేతబడి చేస్తుందనే నెపంతో ఓ మహిళపై దాడి చేసిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మచ్చాపూర్‌లో జరిగింది. బానోత్ మొగిలి అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం బాధితురాలి ఇంటిముందు దుర్భాషలాడాడు. అనంతరం రాత్రి ఆమె పడుకున్నాక బ్లేడ్‌తో గొంతు కోసే ప్రయత్నం చేయగా.. సదరు మహిళ కేకలు వేయడం వల్ల చుట్టుపక్కల వారు వచ్చారు. గాయపడ్డ ఆమెను ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి ప్రమాదమేమి లేదని వైద్యుడు తెలిపారు. నిందితుడు బానోత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇవీ చూడండి: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
Intro:Body:Conclusion: