ములుగు జిల్లాలోని బొగతా జలపాతం పాలసంద్రాన్ని తలపిస్తోంది. ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న జలపాతం పర్యాటకుల్ని కనువిందు చేస్తోంది. వర్షాలు కురుస్తున్నందున జలపాతానికి వరదనీరు భారీగా చేరుతోంది. ఆదివారం సెలవు దినమైనందున రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చారు. చిన్నాపెద్దా కలిసి జలధారలను చూస్తూ... ఆనందంగా నీటిలో గంటల తరబడి ఆడుకున్నారు.
ఇదీ చదవండిః ప్లాస్టిక్ వినియోగానికి తప్పదు భారీ మూల్యం..