ETV Bharat / state

ములుగు జిల్లాలో పలు మండలాల్లో స్వచ్ఛందంగా పాక్షిక లాక్​డౌన్​ - తెలంగాణ తాజా వార్తలు

ములుగు జిల్లాలోని పలు మండలాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటిస్తున్నారు. రోజురోజుకు కొవిజ్​ పాజిటివ్​ కేసులు పెరుగుతున్నందున మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు నిర్బంధమే మందు అని ఈ నిర్ణయం తీసుకున్నారు.

mulugu
mulugu
author img

By

Published : May 10, 2021, 10:58 PM IST

పల్లెల్లోను పాజిటివ్​ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని పలు మండలాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటిస్తున్నారు. జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం, మండలాలతో పాటు ములుగు మండలంలోని మల్లంపల్లిలో పాక్షిక లాక్​డౌన్​ అముల చేసేందుకు సమాయత్తమయ్యారు. గ్రామంలో మీటింగు ఏర్పాటు చేసుకుని ఈమేరకు తీర్మానించారు.

నేటి నుంచి ఈనెల 26 వరకు పట్టణాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని గ్రామపెద్దలు, అధికారులు నిర్ణయించారు. ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని... ఎవరూ నిబంధనలు అతిక్రమించకూడదని నిర్ణయించుకున్నారు.

ఇదీ చూడండి: అకాలవర్షానికి నాశనమైన వరిధాన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.