ములుగు జిల్లా కేంద్రంలో వర్తక, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా వారాంతపు లాక్డౌన్ను పాటిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాత్రి కర్ఫ్యూను పాటిస్తూనే ఆదివారం నాడు బంద్ ప్రకటించుకున్నాయి.
ఆదివారం సెలవు కావడం వల్ల ప్రజలు ఎక్కువగా బయట తిరిగే అవకాశం ఉంది. అందువల్ల కరోనా కేసులు పెరగకుండా ఉండడానికి వాణిజ్య సంస్థలు, వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేశారు. ఆదివారం రోజు ములుగులో జరిగే అంగడిని కూడా నిర్వహించకపోవడం గమనార్హం.
అత్యవసర సర్వీసులైన హాస్పిటల్, మెడికల్ షాపులు, కూరగాయలు, పెట్రోల్ బంకులు, ఏటీఎంలు మినహా మిగతావాటిని నేడు స్వచ్ఛందంగా బంద్ చేశారు.
ఇదీ చూడండి: జైన తీర్థంకరుల పాదముద్రలతో తెలంగాణ పావనమైంది: కేసీఆర్