ములుగు జిల్లాలోని ముత్యాల జలపాతానికి సందర్శకులు ఎవరూ రావద్దని స్ధానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న సెలవుదినం కావడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి పర్యటకులు వాహనాలపై అక్కడికి వచ్చారు. గ్రామస్థులు వెనక్కి తిప్పి పంపారు.
జలధారకు వెళ్లే పలు మార్గాలను మూసివేశారు. వరంగల్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఆంక్షలను అతిక్రమించి అడ్డదారిలో ఎవరు వెళ్లినా వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నట్లు పలు ప్రాంతాల్లో హెచ్చరికల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముత్యాల జలపాతానికి పోకుండా వీరభద్రవరం గ్రామం వద్ద రహదారికి అడ్డంగా ట్రాక్టర్ను నిలబెట్టారు. అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యటకులను నియంత్రించేందుకు గస్తీ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు