ETV Bharat / state

Mother and Daughter Died: కూతురి మృతిని తట్టుకోలేక తల్లి దుర్మరణం - mulugu news

Mother and Daughter Died: అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె.. కళ్ల ముందు విగతజీవిలా పడి ఉంటే ఆ మాతృ హృదయం తట్టుకోలేకపోయింది. కుమార్తెను తలచుకుంటూ.. ఆమె జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ.. గుండెలవిసేలా రోధించింది. చివరకు బిడ్డా నీకు తోడుగా నేను వస్తున్నా అంటూ ప్రాణాలు విడిచింది.

Mother and Daughter Died
తల్లి కుమార్తె మృతి
author img

By

Published : Dec 27, 2021, 8:36 AM IST

Mother and Daughter Died: సంతోషంగా జీవిస్తున్న కుటుంబంపై విధికి కన్నుకుట్టింది. గంటల వ్యవధిలోనే పేగుబంధాన్ని కబళించింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొర్రవానిగూడెంలో కూతురి మృతిని తట్టుకోలేక తల్లి మరణించిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికంగా నివాసముండే తోట పోతురాజు-దేవమ్మకు ఇద్దరు కుమార్తెలు.

కూతురి మృతిని తట్టుకోలేక తల్లి దుర్మరణం
కూతురి మృతిని తట్టుకోలేక తల్లి దుర్మరణం

దంపతుల రెండో కుమార్తె దీపప్రియ(26)ను అదే గ్రామానికి చెందిన శివప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఆరేళ్లలోపు లక్ష్మీప్రమీల, సాయిప్రసన్న ఇద్దరు సంతానం. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న దీపప్రియకు స్థానికంగా వైద్యం చేయించారు. తగ్గకపోవడంతో శనివారం భద్రాచలంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు శస్త్రచికిత్స అవసరమని ఏర్పాట్లు చేస్తుండగానే రాత్రి ఆమె మరణించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా రాత్రంతా అక్కడే ఉండి కన్నీటి పర్యంతమైన మృతురాలి తల్లి దేవమ్మ(50) ఆదివారం ఉదయం స్పహ కోల్పోయారు. కుటుంబ సభ్యులు వెంకటాపురం సామాజిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఒకే ఇంట ఇద్దరు మృతి చెందడంతో.. కుటుంబసభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదీ చూడండి: పెళ్లికి వెళ్లి విగతజీవులుగా.. రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.