సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన ఇద్దరు భక్తులు అనంతలోకాలకు వెళ్లారు. అమ్మలను దర్శించుకోకముందే మూర్ఛ వచ్చి మృతి చెందారు. దీంతో ఆ ఇద్దరి కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.
సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన బట్టు వినయ్ కుటుంబసభ్యులతో కలిసి జంపన్నవాగులో స్నానం చేస్తుండగా మూర్ఛ వచ్చింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వినయ్ని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
మరో సంఘటనలో దుమ్ముగూడెం మండలం, సుబ్బారావుపేటకు చెందిన తామ వినోద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకుంటుండగా మూర్ఛ వచ్చంది. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: 'కరోనా'.. పాముల ద్వారా కాదు గబ్బిలాల వల్లేవ్యాప్తి!