ములుగు జిల్లా వెంకటాపురం మండలం జిల్లా కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు పూనేం అనిల్, సర్సీలగా గుర్తించారు.
ప్రమాదంలో మరో పది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఇవీచూడండి: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం