ETV Bharat / state

Hunting in Telangana forests : వేటగాళ్ల ఉచ్చు.. వన్యప్రాణులకు ముప్పు - animal hunting in telangana

ఎన్ని సంరక్షణ చర్యలు తీసుకుంటున్నా వేటగాళ్ల వలకు చిక్కి వన్యప్రాణులు ఊపిరి వదులుతున్నాయి. అంతరించిపోతున్న వన్యప్రాణుల్లో.. పెద్దపులులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆవులు, మనుషులపై దాడి చేస్తున్నాయని వాటిని పట్టుకునేందు బిగించిన ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. మరోవైపు కొందరు వ్యక్తులు మాత్రం.. మాటు వేసి.. పక్కా ప్లాన్​తో.. పులులకు వలవేసి వాటి ఆయువు తీస్తున్నారు. వాటి చర్మం, గోళ్లను అమ్ముకుని తమ కక్కుర్తి చూపిస్తున్నారు.

Hunting in Telangana forests
Hunting in Telangana forests
author img

By

Published : Oct 4, 2021, 9:53 AM IST

అడవి(Hunting in Telangana forests)లో పులి కదలికలను గమనించారు. కాసుల కోసం కక్కుర్తిపడి.. ఉచ్చులు పెట్టి బంధించి.. నిర్దాక్షిణ్యంగా చంపేశారు. పులిని మట్టుబెట్టిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతా అయిపోయాక.. పులి చర్మం, గోళ్లు, ఇతర భాగాలను ములుగు పోలీసులు నింపాదిగా స్వాధీనం చేసుకున్నారు. అంతరించిపోతున్న వన్యప్రాణుల్లో పెద్దపులులు ముందు వరుసలో ఉన్నాయి. పులి సంరక్షణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వేటగాళ్ల ఉచ్చులకు చిక్కి ఊపిరి వదులుతున్నాయి.

యానిమల్ ట్రాకర్స్​తో నిఘా..

తాజాగా ములుగు జిల్లాలో పెద్దపులి మృత్యువాత పడడం కలకలం రేపింది. ఛత్తీస్​గఢ్​ అడవుల(Hunting in Telangana forests) నుంచి ములుగు, జయశంకర్ భూపాలపల్లి పరిసర అటవీ ప్రాంతాల్లో గత కొంతకాలంగా పెద్దపులి సంచరిస్తోంది. మూడు నెలల క్రితం....మొదటిసారిగా పులి జాడలను అటవీ శాఖ అధికారులు తాడ్వాయ్ అటవీ ప్రాంతంలో గుర్తించారు. ఆగస్టు1న 2021న తాడ్వాయ్ అటవీ ప్రాంతాల్లో(Hunting in Telangana forests) పాదముద్రలు అధికారుల కంట బడ్డాయి. ఆ తరువాత ములుగు, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లుగా నిఘా ద్వారా తెలిసింది. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించడానికి 4 జిల్లాల అటవీ శాఖ అధికారులు.. అడవుల్లో గస్తీని ముమ్మరం చేశారు. అటవీ సిబ్బంది, బేస్ క్యాంప్ వాచర్లు, యానిమల్ ట్రాకర్స్ కెమెరాలు ఏర్పాటు చేస్తూ పెద్దపులి సంచారంపై నిఘా పెట్టారు. ఇంతలోనే పులి వేటగాళ్లకు చిక్కి మృత్యువాత పడింది.

వెంటాడి.. వేటాడి..

అడవి(Hunting in Telangana forests)లో తిరిగే పులిని వేటాడి వాటి మాంసం, చర్మం, గోళ్లు అమ్మితే అధికంగా డబ్బు గడించవచ్చన్న దుర్భుద్దితో.. మడకం, నరేశ్, ఇరుమయ్య, ముకేశ్, దేవా, గంగయ్యలు మరికొందరితో కలసి తాడ్వాయి మండలం కొడిశాల అటవీ ప్రాంతంలో ఉచ్చులు బిగించి పులిని దారుణంగా చంపేశారు. అనంతరం పులి గోళ్లు, చర్మాన్ని అమ్మడం కోసం ఛత్తీస్​గఢ్​కు వెళ్తుండగా పోలీసులుకు చిక్కారు. వీరి నుంచి పులి చర్మం, గోళ్లు, కళేబరం, ఎముకలు, ఉచ్చులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. అటవీ ప్రాంతంలో తిరిగే పులి, ఇతర వన్యప్రాణుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అడవి జంతువులను వేటాడే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

వారి ఉదాసీనత వల్లే..

ఇటీవల కాలంలో ఛత్తీస్​గఢ్ నుంచి పులి, చిరుతలు.. ములుగు, భూపాలపల్లి, భద్రాద్రికొత్తగూడెం తదితర జిల్లా అటవీ ప్రాంతాల(Hunting in Telangana forests)వైపు ఎక్కువగా వస్తున్నాయి. నీటి వనరులు పుష్కలంగా ఉండటం.. ఆహారం సమృద్ధిగా లభిస్తుండటం వల్ల ఈ ప్రాంతాలకు దారిబట్టాయి. తాడోబ్, ఇంద్రావతి ప్రాంతాల నుంచి గోదావరి దాటి మరి ఈ ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇక్కడి అడవుల్లో పులి ఆనవాళ్లు కనిపించడం హర్షం వ్యక్తం చేయాల్సిన విషయమే అయినా.. వాటిని పక్కా ప్లాన్​ చేసి మరీ మట్టుబెట్టడం ఆందోళనకర విషయం. దాహం, ఆకలి తీర్చుకోవడానికి నివాసానికి అనువైన ప్రదేశమని పులులు ఈ ప్రాంతాలకు వలస వస్తుంటే వాటికి రక్షణ కరవవుతోంది. అధికారుల ఉదాసీనత వల్లే పెద్దపులి ప్రాణాలు కోల్పోయిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నెలన్నర క్రితం ఛత్తీస్​గఢ్​లో పులిని వేటాడి దాని చర్మాన్ని ములుగు జిల్లాలోని ఏటూరి నాగారం ప్రాంతంలో విక్రయించేందుకు ప్రయత్నించిన వేటగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడి అడవుల్లోనూ వేటగాళ్ల వల్ల పులలకు, ఇతర వన్యప్రాణులకు ముప్పు ఉన్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

వలసొస్తే.. వేటాడేస్తున్నారు..

అటవీ ప్రాంతం(Hunting in Telangana forests) అధికంగా విస్తరించి ఉండటం వేటగాళ్లకు వరమవుతోంది. పులి, చిరుత, జింకలు, దుప్పులు, కొండగొర్రెలు మొదలైన జీవాలపై వేటగాళ్ల కన్నుపడుతోంది. అదును చూసి వేటాడి... వాటి శరీర భాగాలను పట్టణ ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వన్యప్రాణుల కోసం అడవుల్లో అమర్చే విద్యుత్ వైర్లు, ఉచ్చులు అమాయకుల ప్రాణాలనూ బలిగొంటున్నాయి. వాజేడు మండలం ధర్మారంలో వన్యప్రాణులకోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి ఇటీవలే మృత్యువాత పడగా.. అదే మండలంలోని లక్మీపురంలో మరో వ్యక్తి గాయాలపాలయ్యాడు. మూడు నెలల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో కొండగొర్రెను వేటగాళ్లు ఉచ్చులు బిగించి హతమార్చి దాని మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు చిక్కారు. ఆరు నెలల క్రితం మహాముత్తారం మండలంలో నిమ్మగూడెం వద్ద దుప్పి మాంసాన్ని రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకుని సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

ఆగడాలను అడ్డుకుంటేనే..

పులి సంచరించే ప్రాంతాలు సురక్షితమైనవేనా.. వాటి వల్ల ఎవరికైనా ముప్పు కలుగుతోందా.. పులల కోసం వేటగాళ్లు వల పన్నుతున్నారా.. వేటగాళ్ల బారిన పడకుండా పులలను ఎలా సంరక్షించాలి.. పశువులు, మనుషులు పులుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వన్యప్రాణులను వేటాడే వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని.. పోలీసులు, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో వీరిపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు చర్యలకు ఉపక్రమిస్తేనే.. అడవిలో మూగజీవాలకు మనుగడ ఉంటుందని అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.