Medaram Jathara: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతంగా ముగిసినా ఆదివారం కావడంతో భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో వనదేవతలను దర్శించుకుంటున్నారు. వన దేవతలు వన ప్రవేశం చేసినపప్పటికీ.. భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
పేరుకుపోయిన చెత్త
మరోవైపు జాతర ముగియటంతో.. ఎక్కడికక్కడ చెత్తా చెదారం పేరుకుపోయాయి. పారిశుద్ధ్య కార్మికులు వాటిని తొలగించే పనిలో నిమగ్నం అయ్యారు. మేడారం, ఊరట్టం, కొత్తూరు, జంపన్న వాగు, కన్నెపల్లి, నార్లపూర్, చింతల్ క్లాస్ తదితర ప్రాంతాల్లో 4 రోజులపాటు భక్తులు తిని పాడేసిన పదార్థాలను పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని.. లేనిపక్షంలో దుర్వాసనతో అంటువ్యాధులు వస్తాయని గ్రామస్థులు అంటున్నారు.
పదిరోజుల పాటు శుభ్రతా కార్యక్రమం
చుట్టుపక్క పొలాల్లో వదిలివెళ్లిన చెత్తాచెదారాన్ని త్వరితగతిన తీసేయాలని గ్రామస్థులు పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. వారం పది రోజుల పాటు పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తామని పంచాయతీరాజ్ శాఖ అధికారి వెంకయ్య చెప్పారు.
ఇదీ చదవండి: