మేడారంలో దొంగలు తమ చోర కళను చూపిస్తున్నారు. జాతరే అదనుగా చోరీలకు పాల్పడుతున్నారు. క్యూలైన్లలో, గద్దెల వద్ద, భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్నచోట, తోపులాట సమయంలో దొంగలు బంగారు నగలు, పర్స్‌లు, చరవాణిలు ఎత్తుకెళ్తున్నారు.
కొంతమంది సెల్ఫీలు తీసుకుంటూ బయటి ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న మహిళా...పురుష దొంగలు చోరీలు చేస్తున్నారు. సరుకులు అమ్ముకోగా వచ్చిన నగదు చోరీకి గురైందని ఓ కోళ్ల దుకాణ దారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇప్పటివరకు మేడారం జాతరలో 17 చోరీ కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదు చేయని భక్తులు ఎంతో మంది ఉన్నారు. క్యూలైన్లో ఓ మహిళా దొంగ.. పర్స్‌ను చోరీ చేస్తుండగా పోలీస్ మిత్ర కార్యకర్త పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇవీ చూడండి: 'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'