ETV Bharat / state

సమ్మక్క-సారలమ్మ జాతరకు 9వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు - మేడారం జాతర

Sammakka-Saralamma Jatara: మేడారంలో ముందస్తు సందడి నెలకొంది. మహాజాతరకు మరో మూడు రోజులు ఉండగానే భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జాతర జరుగనుంది. సమ్మక్క-సారలమ్మ జాతరకు 9వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ప్రశాంతంగా జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి తర్ఫీదు ఇచ్చారు.

Sammakka-Saralamma Jatara
Sammakka-Saralamma Jatara
author img

By

Published : Feb 14, 2022, 5:18 AM IST

medaram Jatara 2022: ప్రతిష్ఠాత్మకమైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సజావుగా సాగేందుకు పోలీసుశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. భారీస్థాయిలో 9 వేల మంది పోలీసులను మోహరిస్తుండటంతో పాటు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. డీజీపీ కార్యాలయంలో అనేకమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి పకడ్బందీ బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. జాతర ప్రశాంతంగా జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి తర్ఫీదు ఇచ్చారు. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేలా డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

33 పార్కింగ్‌, 37 హోల్డింగ్‌ ప్రదేశాలు

జాతరకు ఈసారి 1.25 కోట్ల మంది భక్తులు వస్తారని పోలీసుశాఖ అంచనా వేసింది. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది. 3.5 లక్షల వాహనాలు వచ్చే అవకాశం ఉందని, ఆర్టీసీ నడుపుతున్న 9 వేల బస్సులు దీనికి అదనమని అధికారులు లెక్కగట్టారు. భారీసంఖ్యలో వాహనాలు రానుండటంతో ట్రాఫిక్‌ సమస్య నివారణపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. వాహనాలను నిలిపేందుకు 33 పార్కింగ్‌ స్థలాలు, అవి నిండిపోతే వాహనాలను తాత్కాలికంగా నిలిపివేసి.. తర్వాత పంపించేందుకు 37 ట్రాఫిక్‌ హోల్డింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఏవైనా కారణాలతో వాహనాలు రోడ్డుమధ్యలో నిలిచిపోతే తొలగించేందుకు 11 క్రేన్లు, 6 టోవింగ్‌ వాహనాలు, 20 జేసీబీలను సిద్ధంగా ఉంచుతున్నారు. పార్కింగ్‌ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వాహనదారులకు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. ట్రాఫిక్‌తోపాటు ఇతరత్రా సమాచారం తెలిపేందుకు జాతర మార్గంలోని రహదారులపై 20 డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డులు పెడుతున్నారు. మరోవైపు జాతరలో గొలుసులు, సెల్‌ఫోన్‌లతోపాటు పర్సుల చోరీల నివారణకు చర్యలు చేపట్టాలని, పాత నేరస్థులపై నిఘా వేసి ఉంచాలని అధికారులు ఆదేశించారు.

24 గంటలూ పర్యవేక్షణ

మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో జాతరకు వచ్చే ప్రజాప్రతినిధుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 382 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్‌ కెమెరాలతో జాతర ప్రాంతాన్ని 24 గంటలపాటూ పర్యవేక్షించనున్నారు. జాతరకు దారితీసే పస్రా రోడ్డులో ప్రతి రెండు కిలోమీటర్లకు ఒకటి, మిగతా రహదారుల్లో ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున పోలీసు ఔట్‌పోస్టు పెడుతున్నారు. భక్తులకు సహకారం అందించేందుకు 50 ప్రజా సమాచార కేంద్రాలనూ ఏర్పాటు చేస్తున్నారు.

మేడారంలో పోటెత్తిన భక్తులు

మేడారంలో ముందస్తు సందడి నెలకొంది. మహాజాతరకు మరో మూడు రోజులు ఉండగానే భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జాతర జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఒక్కరోజే 3 లక్షల మందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వేకువజామున 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దర్శనాలు సాగాయి. ఎత్తుబెల్లం, చీరసారెలు, ఒడిబియ్యంతో భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. గద్దెల ఆవరణ భక్తులతో కోలాహలంగా మారింది. క్యూలైన్లు నిండిపోయాయి. జంపన్నవాగు, మేడారం పరిసర ప్రాంతాలు జనజాతరను తలపించాయి. మేడారం-పస్రా, మేడారం-తాడ్వాయి, మేడారం-కాటారం రహదారులు వాహనాలతో నిండిపోయాయి. పార్కింగ్‌ స్థలాలు కిక్కిరిసిపోయాయి. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి: MEDARAM JATARA:మహాజాతరకు మూడ్రోజుల ముందే గద్దెల వద్ద రద్దీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.