ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.
సంక్రాంతి పండుగ సెలవులు ఉండటం అమ్మవార్ల వద్దకు భక్తజనం పోటెత్తింది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో బారులు తీరారు. గిరిజన ఆరాధ్యదైవమైన సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు తీర్చేందుకు నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) భక్తులు అమ్మ వార్లకు సమర్పించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
- ఇదీ చూడండి : 'నోట్లపై లక్షీదేవి ఉంటే 'రూపాయి' చల్లగా ఉంటుంది'