ETV Bharat / state

యుద్ధప్రాతిపదికన జంపన్న వాగు పునరుద్ధరణ చర్యలు - ములుగు జిల్లా

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల - కొండాయి గ్రామాల మధ్యలో జంపన్న వాగుపై నిర్మించిన వంతెన కుంగిపోయింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూడు స్లాబులు కొట్టుకుపోయినట్లు ఈఎన్​సీ రవీందర్ రావు వెల్లడించారు.

యుద్ధప్రాతిపదికన జంపన్న వాగు పునరుద్ధరణ చర్యలు

author img

By

Published : Aug 22, 2020, 7:33 PM IST

ఇటీవలే కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల - కొండాయి గ్రామాల మధ్యలో జంపన్న వాగుపై నిర్మించిన వంతెన కుంగిపోయింది. ఈ నేపథ్యంలో చినబోయినపల్లి నుంచి కొండాయి వరకు గల ఈ రోడ్డును ఐటీడీఏ నుంచి ఆర్అండ్​బి శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వరద ఉధృతి తగ్గిన వెంటనే రోడ్లు, భవనాల శాఖకు బదిలీ చేసుకుని రెండు పిల్లర్లు కుంగిపోయాయి. స్లాబుల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని రోడ్లు, భవనాల శాఖ ఈఎన్​సీ రవీందర్ రావు తెలిపారు.

మూడు స్లాబులు కుంగిపోయాయి...

2009లో ఈ వంతెన పరిపాలన అనుమతులు పొంది 2011 సంవత్సరంలో ఐటీడీఏ శాఖ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించామన్నారు. ఫలితంగా నిర్మాణం పూర్తి చేసుకుని 2015లో అందుబాటులోకి వచ్చిందని వివరించారు. 119 మీటర్ల పొడవులో ఈ వంతెన నిర్మాణం జరిగిందన్నారు. ఇందులో రెండు పిల్లర్లు నేలలోకి కుంగడం వల్ల మూడు స్లాబులు ( మొత్తం 50 మీటర్లు ) కిందకి కుంగాయని రవీందర్ పేర్కొన్నారు.

ఇవీ చూడండి : స్త్రీ మూర్తిగా గణనాథుడు.. ఆలయాలు ఎక్కడంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.