Telangana Minister Seethakka Political Profile : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క, బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై 33,700 మెజార్టీతో ఘనవిజయం సాధించారు. సీతక్కకు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. హస్తం పార్టీ(Congress Party) కేబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత సీతక్కకు కీలక పదవి ఇచ్చే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై సీతక్క గెలుపొందారు. ములుగులో మళ్లీ సీతక్క ట్రెండ్ సెట్ చేశారు.
Seethakka Political Profile : ధనసరి అనసూయ అలియాస్(సీతక్క), తెలంగాణకు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె తన రాజకీయ అరంగేట్రాన్ని తెలుగుదేశం పార్టీ ద్వారా చేశారు. ములుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సీతక్క రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా అడవుల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేసిన మాజీ నక్సలైట్ సీతక్క అలియాస్ ధనసరి అనసూయ.
నక్సలైట్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి సీతక్క : ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్‌గా, దళం లీడర్‌గా ప్రధాన భూమిక పోషించారు సీతక్క. ఆ తర్వాత నక్సలైట్లు జన జీవన స్రవంతిలో కలవాలని నందమూరి తారక రామారావు పిలుపునివ్వడంతో వారంతా పోరుబాట వదిలి లొంగిపోయారు. వివిధ హోదాల్లో పని చేసిన సీతక్క, కామ్రేడ్‌గా దాదాపు రెండు దశాబ్దాల పాటు గడిపారు. ఈ సమయంలోనే సీతక్క దళకమాండర్ నక్సల్ నాయకుడిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు. ఆ సమయంలో తనకు తానుగా సీతక్క పోలీసులకు లొంగిపోయారు.
బ్యాలెట్ పత్రంపై ఫొటో చిన్నగా ముద్రించటంపై - ములుగు ఎమ్మెల్యే సీతక్క ధర్నా
Seethakka Political Journey : ఆమె తన అజ్ఞాత జీవితానికి గుడ్‌బై చెప్పి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. 2001లో హైదరాబాద్‌లో న్యాయవాదిగా మారడానికి సీతక్క ఎల్ఎల్బీ చదివారు. ఈ సమయంలోనే ప్రజా విధానం, పాలనపై ఆసక్తి పెంచుకున్నారామె. అనంతరం సామాజిక సేవలో చురుగ్గా ఉంటూ స్థానికంగా జనం మెచ్చిన నాయకురాలిగా పేరు సంపాదించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సీతక్కకు 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున ములుగు నియోజకవర్గం టికెట్‌ను ఇచ్చారు.
2004 నుంచి 2023 వరకు సీతక్క రాజకీయ ప్రస్థానం : 2004లో తొలిసారి టీడీపీ నుంచి పోటీ చేసిన సీతక్క, కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అయినాసరే వెనుదిరగకుండా 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసి, మళ్లీ అదే కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, ములుగు స్థానం నుంచి సమీప అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం సీతక్క తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు.
'అవినీతి కోరల్లో చిక్కుకున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గద్దె దించటం ఖాయం'
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌తో మళ్లీ అదే ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే సీతక్క 2022 డిసెంబర్ 10న తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా నియామకం అయ్యారు. ఇక ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ములుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 33,700 మెజార్టీతో విజయఢంకా మోగించారు.
మరోవైపు రాహుల్ గాంధీ తన తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని కూడా ములుగు జిల్లా నుంచి మొదలుపెట్టడమే కాదు, సీతక్క తన చెల్లి అని కూడా అభివర్ణించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సీతక్కకు ఉన్న అనుబంధం అలాంటిదనే చెప్పలి. అటు గ్రామీణ పార్టీ కార్యకర్తలతో కూడా సీతక్కకు మంచి సంబంధాలు ఉన్నాయి.
Congress CM Candidate MLA Seethakka : ' ఎమ్మెల్యే సీతక్క మా సీఎం'.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్