ETV Bharat / state

సజీవ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ @ఫొటోగ్రాఫర్‌ శ్రవణ్ - కెమెరా క్లిక్‌మందంటే అవార్డు పక్కా!

Special Story on Best Photographer Shravan : ఆ యువకుడికి ఫొటోగ్రఫీ అంటే ఇష్టమే కాదు, ప్రాణం కూడా. గొప్ప ఫొటోగ్రాఫర్‌గా ఎదగాలనే సంకల్పంతో పైసా పైసా కూడబెట్టి మరీ కెమెరా కొనుక్కున్నాడు. సజీవ చిత్రాలు తన కెమెరాలో బంధించేందుకు పల్లెలు, పట్నాలు రోజుల తరబడి తిరిగాడు. గంటల తరబడి వేచి చూసి ప్రకృతి చిత్రాలు ఒడిసిపట్టాడు. తన కష్టానికి ప్రతిఫలంగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులూ దక్కాయి. ప్రధాని మోదీ నుంచీ ప్రశంసలు అందుకున్నాడు. ములుగు జిల్లాకు చెందిన ఆ యువ ఫొటోగ్రాఫర్‌ కథనం చూసేద్దామా.

Special Story on Best Photographer Shravan

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2023, 5:04 PM IST

సజీవ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ @ఫొటోగ్రాఫర్‌ శ్రవణ్ - కెమెరా క్లిక్‌మందంటే అవార్డు పక్కా!

Special Story on Mulugu Photographer Shravan : అత్యుత్తమ ఫొటోగ్రాఫర్‌లలో ఒకరిగా నిలవాలనేది ఈ యువకుడి అభిలాష. ఎలాంటి ఫొటోనైనా జీవకళ ఉట్టిపడేలా తీయడం తన ప్రత్యేకత. ప్రకృతి అందాలను సజీవ చిత్రాలుగా మలిచేందుకు ఇతడు పడే తపన అంతా ఇంతా కాదు. అందుకే శ్రవణ్ తీసే ఫొటోలు చూపరులను కన్నార్పకుండా చేస్తాయి. ఇటీవల కేరళలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో స్వీయ ప్రతిభతో అవార్డునూ సొంతం చేసుకున్నాడు ఈ యువకుడు.

పాలంపేట గ్రామానికి చెందిన తడండ్ల శ్రవణ్, పాఠశాల దశలో బ్యాడ్మింటన్, కుస్తీ పోటీల్లో చురుగ్గా పాల్గొనేవాడు. తండ్రి పర్యాటక శాఖ ఉద్యోగి కావడంతో సెలవు దినాల్లో ఆయనతో కలిసి తరచూ పర్యాటక ప్రాంతాలు చుట్టేసేవాడు. అక్కడికొచ్చే సందర్శకులు ఫొటోలు తీయడం శ్రవణ్‌ దృష్టిని ఆకర్షించింది. ఏకాగ్రతగా ఫొటో తీసే విధానాన్ని గమనించేవాడు. అలా తెలియకుండానే ఫొటోగ్రఫీపై మక్కువ పెంచుకున్నానంటున్నాడు శ్రవణ్‌.

South India Travel Photographer Aravind : సౌత్ ఇండియా అందాలను క్లిక్​మనిపిస్తున్న అరవింద్

ఫ్రెండ్‌ కెమెరా తెచ్చిచ్చిన తండ్రి : పూర్తి స్థాయిలో ఫొటోగ్రఫీపైనే దృష్టి సారించేందుకు బీటెక్ ప్రథమ సంవత్సరంలోనే చదువుకు స్వస్తి పలికాడు శ్రవణ్‌. ఈ రంగంలో నైపుణ్యం పెంచుకునేందుకు అనుభవజ్ఞులు తీసిన ఫొటోలు నిశితంగా పరిశీలించేవాడు. శ్రవణ్‌ ఆసక్తిని చూసి తన తండ్రీ ప్రోత్సహించాడు. మిత్రుని వద్ద కెమెరాను తెచ్చి ఇచ్చాడు. అప్పటి నుంచే ఫొటోగ్రఫీలో తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. స్వతహాగా ప్రకృతి ప్రేమికుడు కావడంతో తొలినాళ్లలో రామప్ప చెరువు, రామలింగేశ్వర ఆలయం, పల్లె సంస్కృతులపై చిత్రాలు తీసేవాడు శ్రవణ్‌. కష్టజీవుల శ్రమపై తీసిన ఫొటోలకు ప్రశంసలందుకున్నాడు. తన శ్రమకు క్రమంగా గుర్తింపు రావడంతో తనకంటూ ఒక సొంత కెమెరా ఉండాలని భావించాడు. చిన్నాచితకా పనులు చేసి డబ్బులు కూడబెట్టి కెమెరా కొనుక్కున్నాడు.

Macro Wildlife Photography: పురుగుల వెంట పడ్డాడు.. అవార్డులు దక్కించుకున్నాడు

ఫొటోగ్రఫీనే సంపాదన మార్గంగా : ఆరంభంలో శ్రవణ్‌ ఫొటోలకు ప్రశంసలు వచ్చినా, ఎలాంటి ఆదాయం ఉండేది కాదు. తనకు అప్పటికే వివాహం కావడంతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకున్నాడు. తనకిష్టమైన ఫొటోగ్రఫీనే సంపాదన మార్గంగా మలచుకోవాలనుకొని వెడ్డింగ్ ఫొటోగ్రఫీ మొదలుపెట్టాడు. మరోపక్క వరంగల్ పరిధిలోని చారిత్రక ప్రదేశాలు, సమ్మక్క-సారలమ్మ, బతుకమ్మ ఉత్సవాలు, కొమురవెళ్లి మల్లికార్జునుడి జాతర, గోదావరి పుష్కరాలకు సంబంధించిన చిత్రాలను అద్భుతంగా తీసి ఔరా అనిపించుకున్నాడు.

Female photographer: పసిపిల్లల కేరింతలను అందమైన జ్ఞాపకంగా!

వైరల్‌ అయిన ఆ ఫొటోలతోనే గుర్తింపు : గత నెల కేరళలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు శ్రవణ్. అక్కడి ప్రజల జీవన విధానం, సంస్కృతి, పర్యాటక ప్రాంతాలు, కలరియపట్టు యుద్ధ కళలపై విలక్షణ చిత్రాలు తీసి, పోటీలో విజేతగా నిలిచాడు. దిల్లీలో లలిత కళా అకాడమీ వారు నిర్వహించిన పోటీలో గెలిచి ప్రధాని మోదీ ప్రశంసలందుకున్నాడు. ముంబయి తీరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగానే వైరల్‌ అయి తనకో గుర్తింపు తెచ్చాయని ఆనందంగా చెబుతున్నాడు శ్రవణ్‌. ఫొటో గ్రాఫర్‌గా ఇప్పటి వరకూ 50కి పైగా బహుమతులు గెలుచుకున్నాడు శ్రవణ్‌. జీవన భృతి కోసం వెడ్డింగ్ ఫొటో గ్రాఫర్‌గా చేస్తూనే, ఇష్టమైన రంగంలో పేరు ప్రఖ్యాతులు పొందేందుకు అహర్నిశలూ శ్రమిస్తానని చెబుతున్నాడు.

Bird photographer: పక్షుల కోసం.. కలల రెక్కలు కట్టుకుని

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.