కొవిడ్-19 తీవ్రత పెరుగుతున్న తరుణంలో ములుగు జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజలను పంచాయతీ అధికారులు అప్రమత్తం చేశారు. ములుగు మండలం జంగాలపల్లి గ్రామంలో అధికారులు సోడియం హైపో క్లోరైట్ పిచికారీ చేయించారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా... పరిసరాలన్నీ శుభ్రపరిచేందుకు తాము రసాయన ద్రావణాన్ని స్ప్రే చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు మాస్క్లు ధరించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు