మేడారంలో కాసేపట్లో గద్దెపైకి సమ్మక్క రానున్నారు. చిలుకలగుట్ట దిగువన గౌరవసూచకంగా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గాల్లోకి కాల్పులు జరిపారు. చిలుకలగుట్ట నుంచి సంప్రదాయ నృత్యాల మధ్య సమ్మక్కను గద్దె వద్దకు తీసుకొస్తున్నారు. సమ్మక్క వచ్చే దారిని రంగవల్లులతో తీర్చిదిద్దారు. సమ్మక్క రాక కోసం లక్షలాదిగా భక్తులు ఎదురుచూస్తున్నారు.
నిన్న రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవింద రాజును గద్దె వద్దకు చేరారు. మరికొద్ది గంటల్లో సమ్మక్క కూడా భక్తులను ఆశీర్వదించనుంది. రేపు మేడారం జాతరకు గవర్నర్ తమిళి సై, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు.
ఇదీ చూడండి: హాలియాలో పాల వ్యాపారి దారుణ హత్య