రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ములుగు జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలలో తమ వద్ద ఉన్న రెవెన్యూ రికార్డులను వీఆర్ఓలు తహసీల్దార్ లకు అప్పగించారు.
మండల రెవెన్యూ అధికారులు ఒక్కొక్క వీఆర్ఓ దగ్గర స్వాధీనం చేసుకున్న రికార్డులను రిజిస్టర్ లో నమోదు చేసి రికార్డులను భద్రపరిచారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వీఆర్ఓల వద్ద ఉన్న పహానీలు, వన్ బీ, విరాసత్ లకు సంబంధించిన అన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.