ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్ బిల్ట్ కర్మగారానికి సంబంధించిన కాలనీలో 14 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా కార్మికులు కమలాపురం సబ్ స్టేషన్ను ముట్టడించి వంటా వార్పు కార్యక్రమంతో నిరసన తెలిపారు.
అసలేం జరిగిందంటే:
ఆరేళ్లుగా బిల్ట్ కర్మాగారం ఉత్పత్తి లేక మూత పడింది. అప్పటి నుంచి జీతాలులేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్మాగారానికి సంబంధించి కోర్టు తీర్పు పెండింగ్లో ఉండడంతో గతంలో విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన తొమ్మిది కోట్లకు కోర్టు హామి ఇచ్చింది. అయినప్పటికీ కొత్త బకాయి ఉందని విద్యుత్ శాఖ 12 రోజుల క్రితం విద్యుత్ నిలిపివేసింది.
ఆరు సంవత్సరాల జీతం సుమారు 87 కోట్ల రూపాయలు కార్మికులకు రావాల్సి ఉందన్నారు. కోర్టు పరిధిలో కేసు నడుస్తున్నప్పటికీ టీఎస్ సీఎండీ గోపాల్ రావు కరెంటు నిలిపి వేయడం ఎంటని ప్రశ్నించారు. తీర్పు వచ్చే వరకు కరెంటు నిలిపేయొద్దని కోర్టు చెప్పిందని కార్మికులు పేర్కొన్నారు.