ETV Bharat / state

తెలంగాణలోకి మావోయిస్టు కీలక నేత.. పోలీసుల హై అలర్ట్​! - Maoist hidma entered in telangana

తెలంగాణ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించిన పోలీసులు.. తనిఖీలను ముమ్మరం చేశారు. మావోయిస్టు పార్టీ కీలకనేత హిడ్మా(Maoist Leader Madvi Hidma).. తెలంగాణలోకి ప్రవేశించారన్న సమాచారంతో గోదావరి తీరంలో సీఆర్పీఎఫ్ బలగాలతో గాలిస్తున్నారు.

maoist-hidma entered in telangana
maoist-hidma entered in telangana
author img

By

Published : Oct 18, 2021, 1:48 PM IST

Updated : Oct 18, 2021, 3:45 PM IST

తెలంగాణ సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. తనిఖీలను ముమ్మరం చేశారు. మావోయిస్టు పార్టీ కీలక నేత, భారీ దాడుల వ్యూహకర్త మాడ్వి హిడ్మా(Maoist Leader Madvi Hidma) తెలంగాణలోకి ప్రవేశించినట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు అలర్ట్​ అయ్యారు.

ఛత్తీస్​గఢ్​ నుంచి ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలోకి ప్రవేశించారన్న సమాచారంతో కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట రహదారుల వెంబడి పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అనారోగ్య సమస్యతో మెరుగైన వైద్యం కోసం వచ్చినట్టు సమాచారం రావడంతో ఈ ప్రాంతంలోని ప్రైవేటు వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు వైద్యం కోసం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గోదావరి తీర ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

హిడ్మా(Maoist Leader Madvi Hidma) తెలంగాణ ప్రాంతంలో రావడం తప్పుడు సమాచారమని ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ అల్లం వెల్లడించారు. ప్రజలు భయబ్రాంతులకు గురి కావొద్దని సూచించారు.

ఇదీచూడండి:

Last Updated : Oct 18, 2021, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.