ములుగు జిల్లాలోని ఆదివాసీల గూడెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తాడ్వాయి మండలం, గ్రామ పంచాయతీ పరిధిలోని ఇప్పలగడ్డ గోండుకోయ గూడెంలో ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఏఎస్పీ సాయిచైతన్య ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.
కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారేమోనన్న కోణంలో ఆదివాసీలను ప్రశ్నించారు. అనంతరం వారి జీవన స్థితిగతులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక వ్యవసాయ భూములను సందర్శించారు. ఈ ఆపరేషన్లో సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు, స్టేషన్ సిబ్బంది, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి.