ములుగు జిల్లా ఇంచర్ల శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 5 వరకు జరుగుతున్న చారుమజుందార్ మావోయిస్టు వారోత్సవాల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తమయ్యారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో మావోయిస్టులు కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పటేల్ ఆదేశాల మేరకు సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను, కొత్త వ్యక్తులను విచారిస్తున్నారు.
ఇవీ చూడండి: అదిగో చిరుత, ఇదిగో తోక... అంతా ఉత్తదే..