గతంలో జాతరల్లో పలువురు ఫోటోలు దిగటం వల్ల ఫోటోగ్రాఫర్లకు ఉపాధి దొరికేది.. కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు వచ్చాక వారికి ఉపాధి తక్కువైంది. ఈ నేపథ్యంలో భద్రాచలానికి చెందిన ఓ ఫోటోగ్రాఫర్ వినూత్నంగా ఆలోచించి గుర్రాన్ని కొనుగోలు చేసి ములుగు జిల్లాలో మేడారం జాతరకు తీసుకువచ్చాడు. జంపన్న వాగుపై భక్తులను గుర్రంపై ఎక్కించి ఫోటోలు తీస్తుండటం వల్ల క్యూ కడుతున్నారు.
సాధారణంగా ఏవరైనా ఫోన్ అయితే కొనగలరు కానీ, గుర్రాన్ని కొనలేరు కదా. ఇతని ఆలోచన సఫలీకృతమైన ఫోటోలు దిగేందుకు భక్తులు, పిల్లలు ఉత్సాహ పడుతున్నారు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఫోటోలు తీసి ఇస్తున్నాడు. భక్తులు వాటిని చూసి మురిసిపోతున్నారు.
ఇదీ చూడండి : శరీరంపై పెయింటింగ్ వేసుకుని ప్రచారం