గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లాలో ఏటూరునాగారం మండలం రామన్నగూడెం సమీపంలో ఉన్న రాంనగర్, లంబాడి తండాతో సహా పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవ సాయంతో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కుసుమ జగదీశ్వర్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. లక్నవరం సరస్సు వరద ప్రవాహం కొంతమేరకు తగ్గింది. మేడారం జంపన్న వాగు కూడా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది.
వరద నీరు ప్రవహించిన ప్రాంతమంతా ఇసుక మేటలు వేసింది. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌తో పాటు.. ఏఎస్పీ సాయి చైతన్య, ఎస్సై, సీఐ తదితరులు వరద ప్రాంతాలను పరిశీలించారు. జిల్లాలోని మంగంపేట మండలం కమలాపురం, గుడ్డెలుగుల పల్లికి గోదావరి వరద నీరు చేరగా.. ఆయా గ్రామాల మహిళలు గోదావరి నదికి హారతులిచ్చి వరద ప్రవాహం తగ్గాలని పూజలు చేశారు.
ఇదీ చూడండి : 'మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మహానగరం'