ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో చర్ల మవోయిస్టు దళసభ్యుడు ఐతు అలియాస్ ఐతడు ఎస్పీ సంగ్రామ్ సింగ్ ఎదుట లొంగిపోయాడు. 2014లో మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై... ఇప్పుడు ఆ పార్టీ విధానాలు నచ్చక, ఆరోగ్యం సహకరించక లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు.
"మావోయిస్టు పార్టీలో సభ్యులుగా చేరి అజ్ఞాతవాసంలోకి వెళ్లి బలహీనవర్గాలకు సేవ చేయాలనేది ఐతడు లక్ష్యం. అదే సంకల్పంతో పార్టీలో చేరాడు. అగ్రనేతలకు నమ్మకంగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. 2017లో ట్రైనింగ్ చేస్తూ కింద పడిపోగా అతని వెన్నుపూసకు దెబ్బ తగిలింది. అప్పుడే పోలీసులకు లొంగిపోతానని... పని చేయలేక పోతున్నానని అగ్రనేతలకు తెలుపగా... అతనిని పార్టీలో కొనసాగాలని బలవంతం చేశారు.
కరోనా వ్యాధి సందర్భంగా గిరిజనలుకు ప్రభుత్వం అందించే నిత్యావసరాలను... బలవంతంగా పార్టీ సభ్యులు తీసుకోవడం చూసి... ఆరోగ్యం సైతం సహకరించక ఈ రోజు లొంగిపోయాడు. తాడ్వాయి మండలం కామారంలోని అతని చిన్నాయన వద్దకు వచ్చి... అతని సహకారంతో జనజీవన స్రవంతిలో కలిశాడు. "
-ఎస్పీ సంగ్రామ్ సింగ్
ఇవీ చూడండి: పంట కొనుగోళ్లలో జాప్యం వద్దు: ఈటల