ములుగు జిల్లా మంగపేట మండలం మొట్టగూడెం సమీపంలోని మల్లూరు వాగుపైనున్న రోడ్డు కొట్టుకుపోవడంతో సమీప గ్రామాల ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. స్థానిక అడవుల్లో వర్షాలు పడితే చాలు వాగులో వరద నీరు ఎక్కువై శనగకుంట, బొందిగూడెం, పూరేడుపల్లి, నరేంద్రపేట, నరసింహసాగర్ వాగు దాటేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాహనాలు పక్కన పెట్టాల్సిందే
వాగు దాటాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఏ క్షణం ఏం జరుగుతుందోన్న భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ అవతలికి చేరుకుంటున్నామంటున్నారు పల్లెటూరి ప్రజలు.
వీరి పరిస్థితి మరీ ఘోరం..!
వృద్ధులు, గర్భిణులు, చంటి పిల్లలు, వాగు దాటేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న వారు ఆస్పత్రికి వెళ్లాలంటే అంబులెన్సు రాని పరిస్థితి ఏర్పడింది. విష జ్వరాలతో ఉన్న వారిని ఆసుపత్రికి తరించాలంటే వాగు దాటాల్సిందే. ఇటీవల సమ్మయ్య అనే వృద్ధుడిని గ్రామీణ యువకులు వాగు దాటించే క్రమంలో అతను ప్రాణాలును కోల్పోయాడు.
మధ్యలోనే ఆపేసిన బ్రిడ్జ్ పనులు
గత ఏడాది హైలెవెల్ బ్రిడ్జి మంజూరైతే ఎన్నికల ముందు నిర్మాణం చేపట్టి మొదటి దశలోనే కాంట్రాక్ట్ పనులు ఆపివేశారని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి తమను ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి :వరంగల్ జిల్లాలో భారీ వర్షం