ETV Bharat / state

Mulugu Medical College Foundation Stone : 'తెలంగాణ ఏ రంగంలో చూసినా ప్రథమ స్థానంలో ఉంది'

Mulugu Medical College Foundation Stone laid by Harish Rao : గడచిన తొమ్మిదేళ్లలో 29 వైద్య కళాశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఏ రంగంలో చూసినా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ.. దక్షిణ భారతదేశానికే ధాన్యాగారంగా మారిందని చెప్పారు. ములుగులో మెడికల్ కళాశాల శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి అనంతరం వరంగల్ నర్సంపేట బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీకే గ్యారంటీ లేదని.. అలాంటి వాళ్లు గ్యారంటీ కార్డు ఇస్తామంటున్నారని విరుచుకుపడ్డారు.

Harish Rao Speech at Narsampet Public Meeting
Harish Rao
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 3:48 PM IST

Updated : Sep 28, 2023, 4:06 PM IST

Mulugu Medical College Foundation Stone తెలంగాణ ఏ రంగంలో చూసినా ప్రథమ స్థానంలో ఉంది

Harish Rao Inaugurate Medical College in Mulugu District : వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు(Health Minister Harish Rao) ములుగు జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద రూ.183 కోట్లతో వైద్య కళాశాల(Medical College) నిర్మాణానికి భూమి పూజ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక నవ జాత శిశువు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే కొడిషల కుంటలో రూ.2 కోట్ల 36 లక్షల వ్యయంతో నిర్మించనున్న సబ‌్​ హెచ్‌ఏఆర్‌(Sub HAR) స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాల హయంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. కేసీఆర్ వచ్చాకే ప్రజలు సురక్షితంగా ఉన్నారని మంత్రి హరీశ్​రావు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించాలని కేసీఆర్‌ ప్రతి జిల్లాలో వైద్య ఆసుపత్రులు నిర్మిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రజల మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ రావాల్సిన అవసరం ఉండకుండా ప్రతి జిల్లాలో.. ప్రతి దానికి, వైద్యం అందేలా ప్రయత్నిస్తుమని మంత్రి హరీశ్​రావు అన్నారు.

Harish Rao Speech at Narsampet Public Meeting : ఆ తరువాత వరంగల్ నర్సంపేట బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ఏ రంగంలో చూసినా ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. నర్సంపేటలో నిరంతరం 150 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. 9 ఏళ్లలో 29 వైద్య కళాశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేశామని వివరించారు. అలాగే నర్సంపేటలో ఎంజీఎం లాంటి ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకే గ్యారంటీ లేదని.. అలాంటి వాళ్లు గ్యారంటీ కార్డు ఇస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ.. దక్షిణ భారతదేశానికే ధాన్యాగారంగా మారిందని తెలిపారు.

Harish Rao Launching Health Department Progress Report : 'త్వరలో ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు'

Harish Rao on Medical Colleges Telangana : మరోవైపు తాజాగా రాష్ట్రంలో వైద్యవిద్య చదివే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. గత ఏడాది రాష్ట్రంలో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రాగా.. మరో 9 కాలేజీ​లు అందుబాటులోకి వచ్చాయి. భారతదేశంలో అతి ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు కలిగిన రాష్ట్రంగా.. తెలంగాణ నిలిచిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రతి లక్ష జనాభాకు.. 22 ఎంబీబీఎస్ సీట్లు(MBBS Seats) ఉన్నాయని పేర్కొన్నారు. 2014లో ఈ విషయంలో చిట్టచివరి స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం.. నేడు అగ్రస్థానానికి చేరిందని అన్నారు. ఇంతకు ముందు రాష్ట్ర విద్యార్థులు వైద్యవిద్య కోసం పక్క రాష్ట్రాలు మొదలు ఉక్రెయిన్, రష్యా వంటి విదేశాలకు వెళ్లి అనేక కష్టాలు పడేవారని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు.

Harish Rao on MBBS Seats in Telangana : తెలంగాణ పిల్లలు రాష్ట్రంలోనే ఎలాంటి కష్టం లేకుండా.. వైద్యవిద్య అభ్యసించే గొప్ప సౌకర్యాన్ని సీఎం కేసీఆర్ కల్పించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. కొత్త వైద్య కళాశాల ఏర్పాటుతో అందుబాటులోకి వచ్చిన నూతన వైద్యసౌకర్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణ వచ్చిన రోజు కేవలం ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవని.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లలో 43 శాతం తెలంగాణలోనే పెరిగాయని హరీశ్‌రావు వెల్లడించారు.

Harish Rao Inaugurates Arete Hospital : 'అంతర్జాతీయ మెడికల్‌ హబ్‌గా తెలంగాణ మారనుంది'

Minister Harish Rao Review On Viral Fevers : 'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం'

Last Updated : Sep 28, 2023, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.