ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో మేడారం జాతరపై కలెక్టర్ నారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు నిర్వహించే జాతర కోసం ఆదివాసీ సంఘాలు సలహాలు ఇవ్వాలని కోరారు. మేడారం జాతరలో ఆదివాసీల అలవాట్లు, జీవనవిధానాన్ని ప్రతిబింబించేలా మోడల్ ట్రైబల్ విలేజీ నిర్మాణం చేపడతామన్నారు. జాతరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ ప్రతినిధులను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
మేడారంతో పాటు దాని పరిసరాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేయాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: మేడారం జంపన్న వాగులో ఇద్దరు గల్లంతు