ETV Bharat / state

రైతులకు పండ్ల మొక్కలు ఉచితంగా ఇస్తాం :  ములుగు కలెక్టర్​ - కలెక్టర్​ కృష్ణ ఆదిత్య

రైతులు పండ్ల మొక్కలు నాటాలనుకుంటే.. ఎలాంటి పండ్ల మొక్కలైనా ఉచితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ములుగు జిల్లా కలెక్టర్​ ఎస్​. కృష్ణ ఆదిత్య తెలిపారు. జిల్లాలో కరోనా వచ్చినట్టు అనుమానం వస్తే.. వెంటనే పరీక్షలు చేసి.. క్వారంటైన్​కు తరలించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

Mulugu Collector press meet
రైతులకు పండ్ల మొక్కలు ఉచితంగా ఇస్తాం :  ములుగు కలెక్టర్​
author img

By

Published : Jun 30, 2020, 4:23 PM IST

కరోనా కట్టడికి వైద్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వ్యక్తులను గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్​ వస్తే వెంటనే క్వారంటైన్​లో ఉంచాలని ములుగు జిల్లా కలెక్టర్​ కృష్ణ ఆదిత్య వైద్యులకు సూచించారు. ఇప్పటికి జిల్లాలో ఐదారుగురికి మాత్రమే పాజిటివ్​ వచ్చిందని, వారంతా పద్నాలుగు రోజులు పూర్తి చేసుకుంటారని తెలిపారు.

జూన్​ 25న ప్రారంభమైన హరితహారం జిల్లాలో ఇంకా కొనసాగుతూనే ఉన్నదని కలెక్టర్​ అన్నారు. ఎర్ర నేల భూములు, నల్లరేగడి భూములు ఉన్న రైతులకు ఎలాంటి పండ్లతోటలు కావాలన్న అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పండ్ల మొక్కలు నాటేందుకు ఎస్సీ, ఎస్టీలకు పూర్తి సబ్సిడీ వర్తిస్తుందని, ఇతరులకు 90% సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. పోడు భూములు, అసైన్​మెంట్ భూములు, రైతులు సాగు చేయకుండా ఉన్న బీడు భూముల్లో, సొంత పొలం గట్లపై మొక్కలు నాటితే నెలకు ఒక్కొక్క మొక్కకు ఐదు రూపాయల చొప్పున చెల్లిస్తామని అన్నారు.

ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.