ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వరినాట్లు వేశారు. ములుగు జిల్లా పాలనాధికారి శనివారం వరినాట్లు వేసి రైతులతో ముచ్చటించారు. జిల్లాలోని గోవిందరావుపేట మండలం రంగాపూర్‌లో జరిగిన ‘రైతు హరితహారం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన పొలంలో నాటేస్తున్న కూలీలను చూసి కారు ఆపి వారితో కలిసి కాసేపు నాటేశారు. పక్కనే ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ బాటలో నడిచారు.
ఇవీ చూడండి: పల్లె అభివృద్ధికి 60రోజుల ప్రణాళిక..