తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ములుగు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష చేపడుతున్న ఉపాధ్యాయులకు స్థానిక ఎమ్మెల్యే సీతక్క సంఘీభావం తెలిపారు. అప్ గ్రేడెడ్, పీఈటీలతో సహా అన్ని వర్గాల ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. పదోన్నతులతో పాటే సాధారణ బదిలీలు నిర్వహించాలని కోరారు.
ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు కల్పించాలని... పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉపాధ్యాయుల ఉద్యమాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి: పెళ్లింట్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు దుర్మరణం