ETV Bharat / state

MLA Seethakka Rally on National Highway in Mulugu : 'వినతులు ఇవ్వడానికి వస్తున్న వారిని అరెస్టుచేయడం బాధాకరం' - ఎమ్మెల్యే సీతక్క లేటెస్ట్ న్యూస్

MLA Seethakka Rally on National Highway in Mulugu : ములుగు జిల్లాలో మంత్రి హరీశ్​రావు పర్యటన నేపథ్యంలో వినతులు ఇవ్వడానికి వస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సే సీతక్క.. పోలీస్​స్టేషన్​కు చేరుకుని మహిళలను పరామర్శించారు. అరెస్టుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలపై వినతులు ఇవ్వడానికి వస్తున్న వారిని అరెస్టు చేయడం బాధాకరమన్నారు. ఈ మేరకు సీతక్క ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు.

MLA Seethakka Rally on National Highway in Mulugu
MLA Seethakka
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 6:04 PM IST

MLA Seethakka Rally on National Highway in Mulugu : ములుగు జిల్లాలో మంత్రి హరీశ్​రావు(Minister Harish Rao) పర్యటనలో భాగంగా ముందస్తుగా అంగన్​వాడి, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, దొడ్ల, గ్రామ మహిళలను, కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకులను అక్రమ అరెస్టులు చేయడం బాధాకరమని ఎమ్మెల్యే సీతక్క జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

MLA Seethakka Fires on Telangana Government : ములుగు జిల్లా కేంద్రంలోనికి మంత్రులు వస్తున్నారని.. తమ వినతులు ఇవ్వడానికి వచ్చిన ఏటూరు నాగారం మండలం దొడ్ల గ్రామానికి చెందిన మహిళలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తీసుకెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka).. పోలీస్​స్టేషన్​కు వెళ్లి దొడ్ల గ్రామ మహిళలను అరెస్టుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రుల పర్యటనలో భాగంగా ముందస్తుగా అంగన్​వాడి, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు, వరద ముంపు ప్రాంత ప్రజలను అరెస్టు చేయడంపై నిరసిస్తూ.. స్థానిక ఎమ్మెల్యే సీతక్క ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు.

Mulugu Medical College Foundation Stone : 'తెలంగాణ ఏ రంగంలో చూసినా ప్రథమ స్థానంలో ఉంది'

'మంత్రులు వస్తున్నారని వినతులు ఇవ్వడానికి వస్తున్న మహిళలను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారు. ఆశా వర్కర్లు, అంగన్​వాడిలను కలవడానికి కూడా మంత్రులు ఇష్టపడడం లేదు. ఈ ప్రభుత్వంలో కనీసం ప్రజలు వినతిపత్రం అందించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అక్రమ అరెస్టును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే అరెస్టు చేసిన వారిని రిలీజ్ చేయాలి. రాష్ట్ర ప్రజలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుంది. ఈ రకంగా అరెస్టు చేసి మహిళలను ఇబ్బందికి గురిచేయడం కరెక్ట్ కాదు. వెంటనే అరెస్టు చేసిన వారిని రిలీజ్ చేయ్యాలి.' -సీతక్క, ఎమ్మెల్యే

MLA Seethakka Comments on Telangana Govt : ప్రజాస్వామ్యానికి ఇది చీకటిరోజు అని తమ సమస్యలపై వినతులు ఇవ్వడానికి వస్తున్న వారిని అరెస్టుచేయడం బాధాకరమని సీతక్క అన్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా గత కొంత కాలంగా అంగన్​వాడి ఉద్యోగులు(Anganwadi Employees), ఆశా వర్కర్లు(Asha Workers), మధ్యాహ్న భోజన కార్మికులు, ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరహారదీక్షలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోగా వారిని అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని అన్నారు. అక్రమ అరెస్టులు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని సీతక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు ప్రజలతో మమేకమై ఉండాలి కానీ.. అరెస్టులతో ప్రజలను భయభ్రాంతులకు గురించి చేయొద్దని సీతక్క కోరారు.

MLA Seethakka Rally on National Highway in Mulugu వినతులు ఇవ్వడానికి వస్తున్న వారిని అరెస్టుచేయడం బాధాకరం

MLA Seethakka Fires on BRS Party : డబ్బు సంచులతో బీఆర్ఎస్ నన్ను టార్గెట్ చేస్తోంది: సీతక్క

Congress CM Candidate MLA Seethakka : ' ఎమ్మెల్యే సీతక్క మా సీఎం'.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.