MLA Seethakka Petition on BRS Government : ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభివృద్ధి నిధుల విడుదలలో ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ములుగు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సీతక్క.. హైకోర్టులో పిటిషన్ వేశారు. జిల్లా మంత్రి ఆమోదంతో నియోజకవర్గాల నిధులు కేటాయించాలన్న జీవో 12ను కొట్టివేయాలని హైకోర్టుకు సీతక్క విజ్ఞప్తి చేశారు.
తమ జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavathi Rathod).. ఉద్దేశపూర్వకంగా ములుగు నియోజకవర్గానికి సీడీఎఫ్(కాన్‌స్టిట్యూయెన్సీ డెవలప్‌మెంట్ ఫండ్స్) నిధులు విడుదల చేయడం లేదన్నారు. పరోక్షంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఉద్దేశించి పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నందున తన నియోజకవర్గానికి నిధులు మంజూరైనా విడుదల చేయడం లేదన్నారు.
ఎన్నికల షెడ్యూలు వస్తే వెనక్కి వెళ్తాయని.. వెంటనే నిధులు విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సీతక్క తరఫు న్యాయవాది కృష్ణ కుమార్ గౌడ్ కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. ఎమ్మెల్యే సీతక్క పిటిషన్‌లోని అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. కాగా, సీతక్క పిటిషన్‌పై అక్టోబర్ 9న తిరిగి విచారణ జరపుతామని శుక్రవారం కేసును వాయిదా వేసింది.
Seethakka Filed a Petition in High Court : కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క తన నియోజకవర్గంలో(Constituency) ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను మెచ్చుకొని 24 గంటలు కాకముందే పిటిషన్ పర్వం మొదలైంది. ములుగు జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చినందుకు, మల్లంపల్లిని మండలంగా ప్రకటించినందుకు మంత్రులు హరీశ్ రావు(Harish Rao), ఎర్రబెల్లి దయాకర్ రావు ఎదుటే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా మల్లంపల్లి పేరును జగదీశ్ పేరుతో జేడీ మల్లంపల్లిగా మార్చాలని విజ్ఞప్తి సైతం చేశారు. ఇలా గురువారం నాడు ప్రభుత్వాన్ని పొగిడిన సీతక్క.. శుక్రవారం హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ వేయటం జరిగింది. ఈ పిటిషన్‌లో ముఖ్యంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై పలు ఆరోపణలు చేశారు. శుక్రవారం పిటిషన్‌పై హైకోర్టు తిరిగి అక్టోబర్ 09న విచారణ జరపనున్నట్లు తెలిపింది.
Seethakka on Manipur Women Incident : 'మణిపుర్ ప్రజలకు మోదీ, అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పాలి'