మే డే సందర్బంగా ములుగులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సీతక్క హజరై... జెండా ఆవిష్కరించారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వ్యాధి కారణంగా కార్మికులకు, పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు.
మంగపేట మండలంలోని చింతకుంటకు చెందిన 70 నిరుపేద కుటుంబాలకు, దోమడలోని 180 ఎస్సీ, ఎస్టీ, ముస్లీం కుటుంబాలకు, తిమ్మాపూర్లోని 80 కుటుంబాలకు, నిమ్మగూడెంలోని 80 కుటుంబాలకు, రోజు వారి కూలీలకు ఒక్కొక్క కుటుంబానికి 5 కిలోల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.