Harish on Health Profile: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్ట్ దిగ్విజయంగా సాగుతున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కేవలం 70 రోజుల్లోనే ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ కోసం శాంపిల్స్ సేకరణ పూర్తి చేసినట్లు ప్రకటించారు. త్వరలోనే ఆయా జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందించనునట్టు స్పష్టం చేశారు. ములుగు, సిరిసిల్ల జిలాల్లో హెల్త్ ప్రొఫైల్‌పై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ములుగులో 1,81,540 మందికి టెస్టులు నిర్వహించగా.. సిరిసిల్లలో 3,38,761 మందికి పరీక్షలు చేసినట్లు హరీశ్ రావు వెల్లడించారు. ఆయా శాంపిల్లను ములుగు, ఏటూరు నాగారంలో తాత్కాలిక ల్యాబ్‌లు ఏర్పాటు చేసి అనాలసిస్ చేయనున్నట్లు పేర్కొన్నారు. బీపీ, షుగర్ సహా 30 రకాల రోగాల నిర్ధరణ కోసం పరీక్షలు చేసినట్లు తెలిపారు. శాంపిల్లను అనాలిసిస్ పూర్తి చేసిన తరువాత వ్యాధులు ఉన్న వారిని గుర్తించి ఆస్పత్రులకు వెళ్లాలని ఫోన్లకు సందేశం పంపాలని సూచించారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ రిజ్వి, ఆయుష్ కమిషనర్ అలుగు వార్షిణి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, కాళోజి వర్శిటీ వీసీ కరుణాకర్ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
మహిళల భద్రతపై సర్కార్ ఫోకస్.. హైదరాబాద్‌లో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..
మహారాష్ట్ర, దిల్లీలో కరోనా పంజా.. ఆ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక!