ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతున్న మేడారం జాతర పనులను ములుగు ఇన్‌చార్జి కలెక్టర్ కర్ణన్, ప్రత్యేక అధికారి బీపీ గౌతమ్ కాలినడకన తిరుగుతూ పనులను తనిఖీ చేశారు. జంపన్న వాగు వద్ద నిర్మించిన తాత్కాలిక మరుగుదొడ్లను పరిశీలించి.. తలుపులు బిగించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. పార్కింగ్ స్థలంలో నీరు నిలవడం వల్ల భక్తులు తమ వాహనాలను రోడ్లపై నిలిపి ఉంచారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారింది. ఇది గమనించిన కలెక్టర్ వాహనాలు పార్కింగ్ ప్రదేశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
మేడారం పనులు పరిశీలించిన కలెక్టర్, ప్రత్యేకాధికారి - medaram works inspection by mulugu collector
మేడారం పనులను జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ కర్ణన్, మేడారం స్పెషల్ ఆఫీసర్ గౌతమ్ పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లో అలసత్వం ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కింగ్ స్థలాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.