ETV Bharat / state

మా కూలీ మాకివ్వండి.. మేడారం శానిటేషన్​ కూలీలు - జిల్లా పంచాయతీ అధికారి

మేడారం జాతర శానిటేషన్​ పనుల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్​ రాజమండ్రి వాసులు తమకు కూలీ డబ్బులు చెల్లించలేదంటూ ములుగు డీపీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమ కూలీ తమకిస్తే సొంతూరికి వెళ్లిపోతామన్నా రు.

medaram sanitation workers protest in front of mulugu dpo office
మా కూలీ మాకివ్వండి; మేడారం శానిటేషన్​ కూలీలు
author img

By

Published : Mar 17, 2020, 8:09 PM IST

ములుగు జిల్లా మేడారం మహాజాతర శానిటేషన్​ పనుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి నుంచి వచ్చిన కార్మికులు ఎంతో శ్రమ పడ్డారన్న విషయం విధితమే. కాగా మేడారంలో శానిటేషన్ పనులు పూర్తయి నెల రోజులు కావొస్తున్నా... జిల్లా పంచాయతీ అధికారి తమకు ఇంకా డబ్బులు చెల్లించలేదని ములుగు డీపీవో కార్యాలయం వద్ద కార్మికులు అధికారితో గొడవకు దిగారు.

ఎంతో కష్టపడి మేడారం, కొత్తూరు, నార్లపూర్, ఊరట్టం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తే జిల్లా పంచాయతీ అధికారి కనీసం తమపై కనికరం చూపడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూలీ డబ్బులు ఇస్తే తమ ప్రాంతాలకు వెళ్తాం కదాని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా కూలీ మాకివ్వండి; మేడారం శానిటేషన్​ కూలీలు

ఇదీ చూడండి : కరోనాతో నర్సుల యుద్ధం..మృత్యువుతోనే పోరాటం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.