ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క..సారలమ్మ చిన్న జాతర లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రెండో రోజు చిన్న జాతరకు భక్త జనం పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిషా నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలొచ్చారు.
జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరుకొని నిలువెత్తు బెల్లం, చీరె, సారే, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గద్దెల వద్ద పూజారులు వెన్నెల వెలుగుల్లో ప్రత్యేక పూజలు కొనసాగాయి. రాత్రంతా జాగారాలు చేసి తల్లులకు నైవేద్యాలు సమర్పించారు. శనివారంతో జాతర ముగుస్తుండటంతో నేడు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: పట్టభద్రుల బరిలో నిలిచేది ఎవరో తేలేది ఇవాళే..