ETV Bharat / state

ముగిసిన సమ్మక్క-సారలమ్మ జాతర

గిరిజనుల ఆరాధ్య దైవం.. భక్తుల పాలిట కొంగు బంగారం సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసింది. నాలుగు రోజులు పాటు అత్యంత వైభవంగా పూజలు అందుకున్న అమ్మవార్లు డప్పు చప్పుళ్ల మధ్య వనంలోకి ప్రవేశించారు.

author img

By

Published : Feb 8, 2020, 11:42 PM IST

medaram jatara 2020
మేడారం జాతర
మేడారం జాతర

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసింది. 5న కన్నెపల్లి నుంచి సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజు గద్దెపైకి రాగా.. 6న చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెకు చేరుకుంది. లక్షలాది మంది భక్తులు తరలొచ్చి.. మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్, ఒడిశా నుంచి భక్తులు వచ్చారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని పరవశించిపోయారు.

అమ్మవార్లను దర్శించుకున్న ప్రముఖులు

జాతర కోసం ప్రభుత్వం 75 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అమ్మవార్లను రాష్ట్ర గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​, హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ దత్తాత్రేయ, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్‌ ముండా, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

భారీ వర్షం

సాయంత్రం 6 గంటలకు దర్శనాలు నిలిపివేశారు. పూజారులు గద్దెల వద్ద సంప్రదాయ పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్ల, వాయిద్యాలు మధ్య భక్తులకు వన దేవతలకు వీడ్కోలు పలికారు. సమ్మక్క-సారలమ్మ వన ప్రవేశం చేసే సమయాన ఆకాశం వర్షించింది. మేడారంలో భారీ వర్షం కురిసింది. వర్షంలోనే వనదేవతల వన ప్రవేశం జరిగింది. తరలిపోతున్న తల్లులను చూసి భక్తులు ఉద్వేగానికిలోనై కంటతడి పెట్టారు.

ఇదీ చూడండి:కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద ఐదుగురు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.