ETV Bharat / state

ములుగు జిల్లాలో మిస్టరీ మర్డర్.. మేడారం వన దేవతల పూజారి దారుణ హత్య - హైదరాబాద్ తాజా నేర వార్తలు

Medaram Priest Brutal Murder: ములుగు జిల్లాలో దారుణం జరిగింది. మేడారం వన దేవతల పూజారిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

brutal murder
brutal murder
author img

By

Published : Mar 22, 2023, 9:21 AM IST

Medaram Priest Brutal Murder: ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాడ్వాయి మండలంలోని మేడారం వన దేవతల పూజారి సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యారు. తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటూరు నాగారం మండలం కొండాయికి చెందిన దబ్బకట్ల రవి.. మేడారానికి చెందిన శ్రీలతను వివాహం చేసుకొని అక్కడే నివసిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని గోవిందరాజు గద్దెపై నెలలో వారం రోజుల పాటు పూజలు నిర్వహిస్తుంటారు. మిగతా రోజుల్లో వ్యవసాయ పనులు చేసుకుంటారు.

రవి వంతులో భాగంగా ఈ నెల 20 నుంచి గద్దెపై పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేటకు చెందిన ఓ వ్యక్తి వన దేవతల దర్శనానికి వచ్చి ఆయనతో పరిచయం పెంచుకున్నాడు. ఇందులో భాగంగానే ఆయనను బయటికి రావాల్సిందిగా సదరు వ్యక్తి కోరాడు. దీంతో రవి పూజల బాధ్యతను కుమార్తె నందినికి అప్పగించి.. అతనితో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలోనే నిన్న పగిడిద్దరాజు పూజారి పెనక మురళీధర్‌ ఇంటి సమీపంలో రవి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు.

వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి సీఐ శంకర్‌, ఎస్సై, క్లూస్‌ టీం సభ్యులు చేరుకొని ఆధారాలు సేకరించారు. ఆయన కుమార్తె నందిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ శంకర్‌ తెలిపారు. బండరాళ్లతో తలపై మోదడంతో రవి మృతి చెందినట్లు తెలుస్తోంది.

మిస్టరీగా మారిన హత్య: రవిని ఎవరు హత్య చేశారు.. ఎందుకు చేశారనేది మిస్టరీగా మారింది. మరోవైపు మృతుడి తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో హనుమకొండలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో రవి భార్య శ్రీలత అక్కడే ఉండి.. ఆమెకు సపర్యలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శనివారం నుంచి ఇద్దరు పురుషులు, ఒక మహిళ హత్య జరిగిన ప్రదేశంలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో హత్య జరిగిందా.. లేదా పథకం ప్రకారం చేశారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మృతుడు రవి
మృతుడు రవి

ఉరేసుకొని వివాహిత బలవన్మరణం: హైదరాబాద్‌లో ఓ వివాహిత ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన అల్తాఫ్‌కు నాంపల్లి ప్రాంతానికి చెందిన ఫర్హానా బేగంతో వివాహం జరిగింది. రెండు నెలల కిత్రం ఫర్హానా బేగం ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమె ఓ శిశువుకు జన్మనిచ్చింది. నిన్న బిడ్డతో సహా అత్తింటికి వచ్చింది. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ ఫర్హానా బేగం తన గదిలో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వారే తమ కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి: చిన్నపాపను తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన బస్సు.. 19 మందికి గాయాలు

రోడ్డును చోరీ చేసిన దొంగలు.. PWD మంత్రి సొంత జిల్లాలోనే ఘటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.