తెలంగాణ కుంభమేళాగా పేరొందిన.. మేడారం జాతర కోలాహలంగా జరుగుతోంది. ఇవాళ సారలమ్మ ఆగమనాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మేడారానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి ఆలయంలో.. సారలమ్మకు పూజారులు ముందుగా సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు.
భక్తి శ్రద్ధలతో గద్దెలపైకి..
సాయంత్రం వేళ.. డప్పు శబ్ధాలు మారుమోగుతుంటే.. భక్తుల జయజయధ్వానాల నడుమ...సారలమ్మ ...గద్దెల చెంతకు ప్రయాణం మొదలుపెడుతుంది. జంపన్నవాగుపైనున్న వంతెన కాకుండా కిందకు దిగి.. వాగును దాటి...సారలమ్మను.. పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో.. గద్దెలపైకి తీసుకువస్తారు. సారలమ్మ వచ్చే మార్గం.. భక్తులతో అత్యంత రద్దీగా మారుతోంది. దారికిరువైపులా భక్తులు నిలుచుని... దండాలు పెడుతుంటే... సారలమ్మ సగౌర్వంగా గద్దెలపైకి చేరుతుంది.
ఇవీ చూడండి: మేడారంలో అపశృతి.. మూర్ఛవ్యాధితో ఇద్దరి దుర్మరణం