ETV Bharat / state

ప్రారంభమైన మేడారం చిన జాతర.. తరలొచ్చిన భక్తులు - మేడారం చిన జాతర

గిరిజను ఆరాధ్య దైవం మేడారం సమ్మక్క, సారలమ్మ చిన జాతర ప్రారంభమైంది. అమ్మవార్లు దర్శనానికి తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్​గ​ఢ్, ఒడిషా నుంచి భక్తులు తరలొచ్చారు.

medaram jathara started from today in mulugu district
ప్రారంభమైన మేడారం చిన జాతర
author img

By

Published : Feb 24, 2021, 12:04 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ చిన జాతర ప్రారంభమైంది. ఉదయం నుంచి భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్, ఒడిషా నుంచి భక్తులు తరలొచ్చారు. మాఘ శుద్ధ పౌర్ణమి మూడు రోజుల ముందే మండ మెలిగే పండగను పూజారులు జరపనున్నారు.

ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు మినీ మేడారం జాతర జరగనుంది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం గుడి ఆవరణలో భక్తులు కిక్కిరిసి పోయారు. సమ్మక్క సారలమ్మ గుడి గేట్లు ముగియటంతో బయట నుంచే మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఇచ్చే బెల్లం, పసుపు కుంకుమ, పూలు తీసుకొని గద్దె లోపల ఉన్న పూజారులు మళ్లీ భక్తులకు అందిస్తున్నారు.

ఇదీ చదవండి: మాయమైన 2.30 కిలోల బంగారం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.