ETV Bharat / state

MEDARAM APP: మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక వెబ్​సైట్​.. - తెలంగాణ వార్తలు

MEDARAM APP: తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 16 నుంచి 19 వరకు వనదేవతల జాతర జరగనుంది. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అధికారిక వెబ్​సైట్​ను, అండ్రాయిడ్​ యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

medaram app
medaram app
author img

By

Published : Feb 3, 2022, 10:32 PM IST

MEDARAM APP: మేడారం మహా జాతరను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య.. ఇవాళ కలెక్టరేట్​లో అధికారి వెబ్​సైట్ www.medaramjathara.com​ను ప్రారంభించారు. అదేవిధంగా మొబైల్​ యాప్​ను ఆవిష్కరించారు. ఈ వెబ్​సైట్​, యాప్​ ద్వారా భక్తులకు తాగునీరు, మేడారం జాతర రూట్​మ్యాప్​, జాతరలో తప్పిపోయిన వారి ఆచూకీ తెలుసుకునే పాయింట్లు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల వివరాలు, దర్శనం క్యూలైన్​, పార్కింగ్​ ప్లేస్​, కొవిడ్​ వ్యాక్సిన్స్​ అందించే పాయింట్లు, మెడికల్​ క్యాంపులు, టాయిలెట్స్​, జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు తదితర వివరాలు తెలుసుకునేందు వీలుగా ఉంటుందని తెలిపారు.

ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా..

ప్రత్యేక వెబ్​సైట్​, యాప్​ ద్వారా భక్తులు తమ అభిప్రాయాలు, సూచనలు ఇవ్వవచ్చని తెలిపారు. అంతే కాకుండా జాతరను ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ వెబ్​సైట్​లో ట్రాఫిక్​ మార్గదర్శకాలతో పాటు, సహాయ కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు బయలుదేరు సమయాలు, ఛార్జీల వివరాలు, స్టేజీల సమాచారంతో పాటు అమ్మవారికి సమర్పించే నిలువెత్తు బంగారం (బెల్లం) ధర వివరాలు పొందుపరచినట్లు తెలిపారు. ఈ యాప్​ అన్ని భాషల్లోను అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ యాప్​ను ప్లేస్టోర్​లో మేడారం జాతర గైడ్​ అఫీషియల్​ అని టైప్​ చేసి డౌన్​లోడ్​ చేసుకోవాలని సూచించారు.​ కార్యక్రమంలో మేడారం జాతర ఇంఛార్జ్​ డీసీపీ గౌస్​ ఆలం, ఏఎస్పీ సుధీర్​ రామ్​నాథ్​ కె కన్​, కలెక్టరేట్​ ఏవో విజయ భాస్కర్​, డీపీఆర్​ఓ బి ప్రేమలత, తదితరులు పాల్గొన్నారు.

అమ్మవార్లను దర్శించుకున్న వైఎస్​ షర్మిల

YS SHARMILA VISIT MEDARAM TEMPLE: వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల... మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గిరిజన మ్యూజియంను సందర్శించారు. గిరిజన దేవుళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని వైఎస్​ షర్మిల పేర్కొన్నారు. భూముల సర్వే పూర్తయినప్పటికీ రైతులకు ఎలాంటి పత్రాలు ఇవ్వలేదని ఆరోపించారు. రైతులందరికీ పట్టా పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని డిమాండ్​ చేశారు. గిరిజన రైతులకు, పోడు వ్యవసాయం చేసుకునే వారికి రైతుబంధు వర్తింపచేయాలని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే గిరిజనులకు మేలు చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: MEDARAM Special Busses : మేడారం జాతరకు 4వేల ప్రత్యేక బస్సులు : ఆర్టీసీ ఎండీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.